NEWSINTERNATIONAL

ఓటు వేయాలి మీరు మాకు కావాలి

Share it with your family & friends

అమెరికా ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్

అమెరికా – యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తితో , ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు యుద్ద వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పింప చేస్తున్నాయి. బ‌రిలో నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డుతున్నారు మాజీ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్ర‌స్తుత దేశ ఉపాధ్య‌క్షురాలు , ప్రెసిడెంట్ గా నిలిచిన క‌మ‌లా హారీస్.

ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతున్నా ఎక్కువ‌గా సానుకూల దృక్ఫ‌థంతో ముందుకు వెళుతున్నారు క‌మ‌లా హారీస్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె కీల‌క , ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

నేను ఇక్కడ సెలబ్రిటీగా లేను, రాజకీయ నాయకురాలిగా లేను. నేను ఒక తల్లిగా ఇక్కడ ఉన్నానని అన్నారు క‌మ‌లా హారీస్. హ్యూస్టన్ ర్యాలీలో పాల్గొన్న ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

.నా పిల్లలు, మన పిల్లలందరూ నివసిస్తున్న ప్రపంచం గురించి లోతుగా శ్రద్ధ వహించే తల్లి, మన శరీరాలను నియంత్రించే స్వేచ్ఛ ఉన్న ప్రపంచం, మనం విభజించబడని ప్రపంచం కావాలని అనుకుంటే త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు క‌మ‌లా హారీస్.

మీరంతా నాకు ఓటు వేయాలి..మీరంతా మాకు కావాలంటూ పిలుపునిచ్చారు .