కమలా హారీస్ ప్రసంగం క్యాన్సిల్
గెలుపు దిశగా డొనాల్డ్ ట్రంప్
అమెరికా – యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అమెరికా ఎన్నికల ఫలితాలు చివరి దశకు చేరుకున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగినా చివరకు డొనాల్డ్ ట్రంప్ తన జీవిత కాలంలో రెండోసారి అత్యున్నతమైన దేశానికి 47వ అధ్యక్షుడిగా కొలువు తీరనున్నారు. దీంతో ఇవాళ ఫలితాల అనంతరం ప్రసంగించాల్సి ఉండగా కమలా హారీస్ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రసంగాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
జోసెఫ్ బైడెన్ ను, కమలా హారీస్ ను దెబ్బ కొట్టడంలో డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్ష పీఠం దక్కించు కోవాలంటే మొత్తం 50 రాష్ట్రాలలో 273 సీట్లు సంపాదించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ ఇంకా కేవలం 3 సీట్ల దూరంలో ఉన్నారు. తన పరాజయం ఖాయమని తేలి పోవడంతో కమలా హారీస్ మౌనంగా ఉన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని ఈ సందర్బంగా పేర్కొన్నారు జోసెఫ్ బైడెన్.
ఆర్థిక మాంద్యం, పన్ను విధింపు, జాబ్స్ లేక పోవడం , ఎక్కువ అప్పులు చేయడం , తదితర అంశాలు కమలా ఓటమికి కారణమయ్యాయని చెప్పక తప్పదు. ఈసారి అమెరికా భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నారైలు ట్రంప్ వైపు మొగ్గు చూపడం విస్తు పోయేలా చేసింది.
ఈ సందర్బంగా కమలా హారీస్ ప్రచార కర్తగా ఉన్న సెడ్రిక్ రిచ్ మండ్ కీలక ప్రకటన చేశారు. “మీరు ఈ రాత్రి వైస్ ప్రెసిడెంట్ నుండి వినలేరు, కానీ మీరు రేపు ఆమె నుండి వినవచ్చు అని పేర్కొన్నారు.