నా విజయానికి కారణం మా అమ్మ
తల్లి గురించి కమలా హారీస్
అమెరికా – ప్రవాస భారతీయురాలైన ప్రస్తుత అమెరికా దేశ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హారీస్ హాట్ టాపిక్ గా మారారు. ఆమెను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం అమెరికా దేశ చరిత్రలో ఒకవేళ అధ్యక్షురాలిగా ఎన్నికైతే తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డ్ సృష్టించనున్నారు. ప్రస్తుతం ఆమె అధ్యక్ష ఎన్నికల బరిలో తన అదృష్టాన్ని పరీక్షించు కోనున్నారు.
అమెరికాలో ఇప్పుడు కీలకంగా మారనున్నారు ఎన్నారైలు (ప్రవాస భారతీయులు). వీరి జనాభా ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి అధ్యక్ష ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. ఆమె బలమైన వ్యక్తి , మాజీ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఎదుర్కొన బోతున్నారు.
ఈ సందర్బంగా కమలా హారీస్ తన జీవితంలో మరిచి పోలేని వ్యక్తి తన తల్లి అని పేర్కొన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా అరుదైన ఫోటోను పంచుకున్నారు. డాక్టర్ శ్యామలా గోపాలన్ హారీస్ 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అమెరికాకు ఒంటరిగా వచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె తనకు ఎల్లప్పుడూ స్పూర్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.