స్వేచ్ఛ..సమానత్వం కల్పించడమే లక్ష్యం
అమెరికా దేశ ఉపాక్ష్యురాలు కమలా హారీస్
అమెరికా – అమెరికా దేశ అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరా హోరీగా కొనసాగుతోంది. ప్రస్తుతం బరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో జరుగుతోంది. ఇరువురు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు కురిపిస్తున్నారు.
అయినా ఎక్కడా వ్యక్తిగతంగా దూషణలకు దిగడం లేదు కమలా హారీస్. శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమె అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా వాగ్దానాన్ని నెరవేర్చడానికి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు.
అందరికీ స్వేచ్ఛ, అవకాశం, సమానత్వం కల్పించాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు కమలా హారీస్. ప్రెసిడెంట్ బైడన్ , తాను పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఇప్పటి దాకా సామాన్యులు, చిన్న వ్యాపారస్తులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఇదిలా ఉండగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి రికార్డు స్థాయిలో 19 మిలియన్ల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు కమలా హారీస్. తాము రాక ముందు కేవలం 7,000 మంది మాత్రమే పబ్లిక్ సర్వీస్ లోన్ మాఫీని పొందారని, కానీ తాము వచ్చాక ఏకంగా 1 మిలియన్లకు పైగా ప్రభుత్వ సేవకులు , అగ్నిమాపక సిబ్బంది , నర్సులు, సేవా సభ్యులు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల రుణాన్ని రద్దు చేయడం జరిగిందని ప్రకటించారు.
ఇదే సమయంలో హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కమలా హారీస్.