డొనాల్డ్ ట్రంప్ పై కమలా హారీస్ ఫైర్
నిప్పులు చెరిగిన ఉపాధ్యక్షురాలు
అమెరికా – డానాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగారు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్. ప్రజలను ప్రేమించ లేని వ్యక్తులు ఎలా దేశాన్ని నడిపిస్తారంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలు హోరా హోరీగా కొనసాగుతున్నాయి. నువ్వా నేనా అంటూ పెద్ద ఎత్తున కొనసాగుతోంది ప్రచారం.
స్వేచ్ఛ, సమానత్వం, ఓటు హక్కు, ప్రతి ఒక్కరికీ గౌరవ ప్రదంగా జీవించే హక్కు కల్పించడం అన్నది తమ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు కమలా హారీస్. తన గెలుపు కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న బరాక్ ఒబామాకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.
అన్ని వ్యవస్థలను గతంలో నిర్వీర్యం చేసింది చాలక తిరిగి ప్రెసిడెంట్ గా ఎన్నుకోవాలని కోరడం విడ్డూరంగా ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు కమలా హారీస్. తాము ఇచ్చిన మాట ప్రకారం భారీ ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 16 మిలియన్లకు పైగా జాబ్స్ కల్పించడం జరిగిందన్నారు.