ట్రంప్ కు అంత సీన్ లేదు – కమలా
ఆయన వల్ల అమెరికాకు నష్టమే
అమెరికా – అమెరికాలో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అంటూ మాటల తూటాలు పేల్చుతున్నారు అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్.
స్వేచ్ఛ, సమానత్వం, ప్రతి ఒక్కరికీ బతికే హక్కు , ఉపాధి కల్పించడం తమ లక్ష్యమని స్పష్టం చేశారు కమలా హారీస్. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు .మరో వైపు ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు మాజీ యుఎస్ఏ చీఫ్ బరాక్ ఒబామా. ఆయన తన సతీమణితో కలిసి ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
మరోసారి తమకు అధికారాన్ని కట్టబెట్టాలని, కమలా హారీస్ ను గెలిపిస్తేనే అమెరికా భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్నారు. ఈ తరుణంలో కమలా హారీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై. ఆయన హింసను నమ్ముకున్నారని, కానీ తాము ప్రేమ, శాంతిని మాత్రమే నమ్ముకుని ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ, సమానత్వం, ప్రతి ఒక్కరికీ ఉపాధి అవకాశాలు ,జాతి, మతం , వర్గం అనే తేడా లేకుండా సౌకర్యాలు కల్పించడమే తమ సర్కార్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ట్రంప్ కు అంత సీన్ లేదన్నారు కమలా హారీస్. ఇదే సమయంలో ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన అమెరికా చీఫ్ పోస్ట్ కు సరి పోతాడా అని ప్రశ్నించారు.