బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు
హైదరాబాద్ – మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తహతహ లాడుతున్నారు. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వన్నాడ ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత జంప్ అయ్యారు.
మాజీ మేయర్, మాజీ మంత్రి కేటీఆర్ కు అనుంగు అనుచరుడిగా పేరు పొందిన బొంతు రామ్మోహన్ సైతం త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన కూడా సీఎం నివాసంలో కలుసుకున్నారు. ఆయనను తీసుకు రావడంలో వేం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఇదిలా ఉండగా తాజాగా మరో ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. ప్రముఖ హీరో అల్లు అర్జున్ స్వంత మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నట్టుండి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఆయన త్వరలోనే బీఆర్ఎస్ ను వీడనున్నారని, కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం.