భగ్గుమన్న బన్నీ మామ
టికెట్ ఇవ్వక పోతే ఎలా
హైదరాబాద్ – పుష్ప స్టార్ , యూత్ ఐకాన్ అల్లు అర్జున్ కు పిల్లను ఇచ్చిన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన నిన్నటి దాకా గులాబీ పార్టీలో ఉన్నారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ జంప్ జిలానీలు ఈ మధ్యన ఎక్కువై పోయారు. ప్రత్యేకించి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారంతా గంప గుత్తగా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఉన్నవే రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు. కానీ పోటీ పడుతున్నది ఎక్కువ మంది. నిన్నటి దాకా తనకు టికెట్ వస్తుందని ఆశించారు బన్నీ మామ. కానీ తీరా ప్రకటించిన వాటిలో తన పేరు లేక పోవడంపై తీవ్రంగా స్పందించారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.
ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. తనకు కోమటిరెడ్డి బ్రదర్స్ మద్దతు ఉందన్నారు. ఇదే సమయంలో తన అల్లుడు బన్నీ తన కోసం ప్రచారం చేసేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పారు. ఈ తరుణంలో పార్టీ తనకు ఏదో ఒక సీటు కేటాయించాలని లేదా భువనగిరి సీటు ఇవ్వాలని కోరారు. మొత్తంగా మనోడు హాట్ టాపిక్ గా మారడం విశేషం.