ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ కు మద్దతు
ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు
అమరావతి – రాబోయే శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలలో టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఏపీ సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి కందుల దుర్గేష్.
శనివారం రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్ లోని శుభమస్తు ఫంక్షన్ హాల్ లో నీటిపారుదల శాఖామాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిన రాజమండ్రి పార్లమెంట్ NDA కూటమి సమీక్ష సమావేశం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి.
ఈ సందర్బంగా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీకి దిమ్మ తిరిగేలా ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ గ్రాండ్ విక్టరీ నమోదు చేయాలని అన్నారు కందుల దుర్గేష్.
ఎన్డీయే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని అన్నారు. తాజాగా ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన వరదలను సైతం తట్టుకుని నిలబడేలా చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. దీపావళి నుంచి ఉచితంగా సిలిండర్ల పథకం ప్రారంభం కానుందని చెప్పారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు పోవాల్సిన బాధ్యత కూటమి నేతలు, కార్యకరలపై ఉందన్నారు కందుల దుర్గేష్.