మంత్రి కందుల దుర్గేష్ పిలుపు
అమరావతి – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు పూల బొకేలు తేవద్దని విన్నవించారు. పేద విద్యార్థులకు ఉపయోగపడేలా బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు ఇతరత్రా సామాగ్రిని తేవాలంటూ సూచించారు. వేల రూపాయలు ఖర్చు చేయొద్దంటూ కోరారు.
కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే వారు వందల రూపాయలు ఖర్చు చేసి కేకులు, బొకేలు, దండలు తీసుకురావద్దన్నారు. పేద వారికి సాయం చేయడం లోనే తనకు సంతృప్తి ఉందన్నారు. .ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి దుర్గేష్ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కొత్త ఏడాదిలో ప్రజలంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో కొలువు తీరాలని కోరారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.