NEWSANDHRA PRADESH

ప‌ల్లెల అభివృద్దిపై ప్ర‌భుత్వం ఫోక‌స్

Share it with your family & friends

ఏపీ మంత్రి కందుల దుర్గేష్ కామెంట్

తూర్పు గోదావ‌రి జిల్లా – గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో నిర్ల‌క్ష్యానికి గురైన ప‌ల్లెల‌ను అభివృద్ది చేసేందుకు త‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కందుల దుర్గేశ్. ప‌ల్లె పండుగ కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్బంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలం సింగవరం గ్రామంలో పల్లె పండగ వారోత్సవాలు కార్యక్రమంలో పాల్గొని ప్ర‌సంగించారు.

సింగవరంలోని ఆంజనేయ పురంలో రూ. 16 లక్షలతో మంజూరు అయిన 5 సిమెంట్ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గత ఐదేళ్లలో గ్రామాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు.

అడిగిన వెంటనే నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం దాదాపు రూ. 11 కోట్లు మంజూరు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు మంత్రి కందుల దుర్గేశ్.

రాష్ట్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే తానేనని వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్రైన్లు, ఆర్ అండ్ బి రోడ్లు, ఇళ్ళ నిర్మాణం తదితర మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామన్నారు.

పెన్షన్ల పంపిణీ, రైతు బకాయిల విడుదల వంటి కార్యక్రమాలను అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టిన ఘ‌న‌త రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ద‌క్కుతుంద‌న్నారు కందుల దుర్గేష్.