NEWSANDHRA PRADESH

ప‌ర్యాట‌క రంగానికి పారిశ్రామిక హోదా

Share it with your family & friends

ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి దుర్గేష్

అమ‌రావ‌తి – కొత్త టూరిజం పాలసీ ద్వారా పర్యాటక రంగంలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని శాసన మండలిలో వెల్లడించారు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.

పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేన‌ని చెప్పారు. నూతన పర్యాటక పాలసీతో పర్యాటక రంగానికి నూతనోత్తేజం వచ్చిందన్నారు. రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో నెంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్ప‌ష్టం చేశారు.

పీపీపీ విధానంలో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. పెట్టుబడిదారులను ఆకర్షించేలా, రాయితీలు కల్పిస్తూ పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి కృత నిశ్చ‌యంతో ఉంద‌న్నారు కందుల దుర్గేష్.

ప్రైవేట్ ఎంటర్ ప్రెన్యూర్స్ ముందుకు వ‌స్తే వారి ఆలోచన, ఆసక్తిని బట్టి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతంలో పర్యాటకులు 5-6 రోజులు ఆహ్లాదంగా గడిపేలా టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

టెంపుల్, అడ్వెంచర్, ఎకో టూరిజంలు కలుపుతూ టూరిజం సర్క్యూట్ లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టూరిజం సర్క్యూట్ లు, టూరిజం హబ్ లతో రాష్ట్ర పర్యాటక రంగం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంద‌న్నారు.

9 జిల్లాల్లో 774 కి.మీల పరిధిలో ప్రతి జిల్లాకొక పర్యాటక కేంద్రం ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. 25 టూరిజం సర్క్యూట్ లు రూపొందించామని వెల్ల‌డించారు మంత్రి దుర్గేష్.. తద్వారా ఎకో, క్రూయిజ్,టెంపుల్, బీచ్, రిలీజియస్, వెల్ నెస్, అగ్రి టూరిజంలు అభివృద్ధి చెందుతాయ‌ని తెలిపారు.