NEWSTELANGANA

ఎంపీ రేసులో కందూరు ర‌ఘువీర్

Share it with your family & friends

కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూతురు

హైద‌రాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లోక్ స‌భ ఎన్నిక‌లలో అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ స‌భ స్థానాలు ఉన్నాయి. ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్థి భార‌తీయ జ‌న‌తా పార్టీ 9 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. మ‌రో వైపు ప్ర‌తిప‌క్ష పార్టీ బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సైతం నాలుగు సీట్ల‌కు క్యాండిడేట్ల‌ను ఎంపిక చేశారు.

ఈ త‌రుణంలో టీపీసీసీ చీఫ్ , సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా కోడంగ‌ల్ లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా క‌ల్వ‌కుర్తి మాజీ ఎమ్మ‌ల్యే, సీడ‌బ్ల్యూసీ శాశ్వ‌త స‌భ్యుడు చ‌ల్లా వంశీ చంద‌ర్ రెడ్డిని ప్ర‌క‌టించారు.

ఇదిలా ఉండ‌గా ఒక్క న‌ల్ల‌గొండ ఎంపీ సీటుకు పెద్ద ఎత్తున పోటీ నెల‌కొంది. తాజాగా పార్టీ వర్గాల నుంచి అందిన స‌మాచారం మేర‌కు మాజీ మంత్రి కందూరు జానా రెడ్డి త‌న‌యుడు కందూరు ర‌ఘు వీర్ రెడ్డి పేరును ఖరారు చేసిన‌ట్లు టాక్.

ఇక ర‌ఘువీర్ రెడ్డితో పాటు ఎంపీ సీటు రేసులో ప‌టేల్ ర‌మేష్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కూతురు శ్రీ‌నిధి రెడ్డి, మాజీ మంత్రి దామోద‌ర్ రెడ్డి త‌న‌యుడు స‌ర్వోత్త‌మ్ రెడ్డి, డీసీసీ చీఫ్ శంక‌ర్ నాయ‌క్ ఉన్నారు.