SPORTS

కేన్ విలియ‌మ్స‌న్ అరుదైన రికార్డ్

Share it with your family & friends

టెస్టు కెరీర్ లో 9,000 ర‌న్స్ పూర్తి

న్యూజిలాండ్ – న్యూజిలాండ్ కు చెందిన ప్ర‌ముఖ క్రికెట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. త‌న టెస్టు క్రికెట్ కెరీర్ లో 9,000 ప‌రుగుల మైలు రాయిని దాటాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి న్యూజిలాండ్ క్రికెట‌ర్ గా రికార్డ్ సృష్టించాడు.

అతి త‌క్కువ మ్యాచ్ ల‌లో ఈ ఫీట్ సాధించిన క్రికెట‌ర్ల‌లో త‌ను మూడో ప్లేస్ లో నిలిచాడు కేన్ విలియ‌మ్స‌న్. అంత‌కు ముందు ఆసిస్ క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ 99 మ్యాచ్ ల‌లో , విండీస్ క్రికెట‌ర్ బ్రియ‌న్ లారా , శ్రీ‌లంకు చెందిన కుమార సంగ‌క్క‌ర 103 మ్యాచ్ ల‌లో, పాకిస్తాన్ కు చెందిన‌ యూనిస్ ఖాన్ 103 టెస్టు మ్యాచ్ ల‌లో ఈ ఘ‌న‌త సాధించారు. వీరంద‌రి స‌ర‌స‌న కీవీస్ మామ కేన్ విలియ‌మ్స‌న్ చేరాడు.

త‌నను క్రికెట్ అభిమానులు ముద్దుగా కేన్ మామా అని పిలుచుకుంటారు. క్రికెట‌ర్ గానే కాకుండా త‌ను గొప్ప మ‌న‌సున్న వ్య‌క్తిగా గుర్తింపు పొందాడు. పాకిస్తాన్ టూర్ సంద‌ర్బంగా వ‌ర‌దల‌కు చిక్కుకున్న వారికి మ‌ద్ద‌తుగా నిలిచాడు. త‌న‌కు వ‌చ్చిన ఫీజును విరాళంగా ఇచ్చాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా దానం చేసే ఆట‌గాళ్ల‌లో త‌ను కూడా ఒక‌డు .