నటిని కాదు సేవకురాలిని
రోడ్ షో లో నటి కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్ – ప్రముఖ వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నుంచి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మీరంతా తనను హీరోయిన్ గా చూడవద్దని కోరారు కంగనా రనౌత్. మీ సోదరిని, మీ కూతురినిగా తనను పరిగణించాలని , కుటుంబంలో సభ్యురాలిగా చూడాలని విన్నవించారు. తాను ఎప్పుడూ నటిగా గర్వ పడ లేదన్నారు. తనకు ముందు నుంచి ఈ దేశం అన్నా, ఈ ప్రాంతం అన్నా, తనకు జన్మ నిచ్చిన మండి అంటే తనకు వల్లమాలిన అభిమానం అని స్పష్టం చేశారు కంగనా రనౌత్.
పాలకులు అంటే అధికారాన్ని చెలాయించడం కాదని, సేవకులం అని గుర్తించాలని అన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే మీ అందరి తరపున వాయిస్ వినిపిస్తానని చెప్పారు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కలిగిన బీజేపీని ఆదరించాలని పిలుపునిచ్చారు కంగనా రనౌత్.