ఎన్నికల బరిలో కంగనా రనౌత్
హిమాచల్ ప్రదేశ్ నుండి పోటీ
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సంచలన ప్రకటన చేసింది. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎవరూ ఊహించని రీతిలో వివాదాస్పద నటిగా పేరు పొందిన కంగనా రౌత్ కు తీపి కబురు చెప్పింది. ఆమెను తమ పార్టీ నుండి అభ్యర్థిగా నిలబెట్టింది. ఇదే విషయాన్ని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వెల్లడించారు.
ముందు నుంచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత సారీ చెప్పడం అలవాటుగా మారింది కంగనా రౌత్ కు. బీజేపీకి చెందిన ఇంకొకరు నూపుర్ శర్మ కూడా సంచలన కామెంట్స్ చేసింది. ఆమె కారణంగా పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆమెకు కూడా టికెట్ ఇచ్చే యోచనలో ఖాసాయ పార్టీ ఉన్నట్టు సమాచారం.
ఇక కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ నుండి పోటీ చేస్తారంటూ బీజేపీ హై కమాండ్ ప్రకటించింది. కంగనా ముందు నుంచీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతుదారుగా ఉన్నారు. ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. దీంతో భారీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్రం.
తనను ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ధన్యావాదాలు తెలిపారు కంగనా రనౌత్.