ఇందిరా గాంధీ పాత్రలో కంగనా
హైదరాబాద్ – వివాదాస్పద నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కీ రోల్ లో నటించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ చిత్రం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ ఎత్తున ఆదరణ చూరగొంటోంది. ఆనాటి దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హయాంలో దేశంలో చోటు చేసుకున్న అప్రకటిత ఎమర్జెన్సీకి సంబంధించి తెర కెక్కించే ప్రయత్నం చేశారు. జయప్రకాశ్ నారాయణ్ గా అనుపమ్ ఖేర్ నటించారు. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ కలకలం రేపుతోంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ నిలిచి పోతుందని చెప్పడంలో సందేహం లేదు. ఒకనాడు ఇందిర అంటే ఇండియా ఇండియా అంటే ఇందిర అన్నంతగా దేశంలో తనదైన ముద్ర కనబర్చారు ఇందిరా గాంధీ. అచ్చం ఆమె లాగనే హావ భావాలను పలికించడంలో సక్సెస్ అయ్యారు కంగనా రనౌత్.
ప్రధానంగా ఎమర్జెన్సీ కాలంలో చోటు చేసుకున్న సంఘటనలను, పరిణామాలను తెర మీద ఆవిష్కరించేందుకు నానా తంటాలు పడ్డారు. ఒక రకంగా కంగనా సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.
1975లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధించబడటానికి దారితీసిన సంఘటనలను ట్రాక్ చేయడం ద్వారా సినిమా ప్రారంభమవుతుంది. దివంగత సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్ వంటి సహాయక తారాగణంతో తెరకెక్కింది.