గెలిపిస్తే మీతోనే ఉంటా
బీజేపీ అభ్యర్థి కంగనా రౌత్
హిమాచల్ ప్రదేశ్ – భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ప్రముఖ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపిస్తే మీతోనే ఉంటానని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇండియా కూటమిలో అంతా ప్రజా ధనాన్ని దోచుకునే వారు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కానీ తాను అలా కాదన్నారు. తనకు ఎలాంటి అక్రమ ఆస్తులు లేవని చెప్పారు.
తాను కరుడుగట్టిన దేశభక్తురాలిని అని చెప్పారు కంగనా రనౌత్. తనపై నమ్మకం ఉంచాలని, మీ విలువైన ఓటును వేయాలని కోరారు. తనను గెలిపిస్తే మీతో పాటే ఉంటానని, మీకోసం సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.
తనకు టికెట్ ఇచ్చి పోటీ చేసేసేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ పాలనలో దేశం వెనక్కి పోయిందన్నారు. కానీ మోదీ ఈ 10 ఏళ్ల పాలనలో భారత్ ఖ్యాతి ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసిందని అన్నారు కంగనా రనౌత్.