జయా బచ్చన్ కు అహంకారం ఎక్కువ
నటి..బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కామెంట్
ముంబై – ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏకంగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సతీమణి, నటి జయా బచ్చన్ పై మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా జయా బచ్చన్ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా తన పేరు పెట్టి పిలిచిన రాజ్యసభ చైర్మన్, దేశ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ పై తీవ్ర అభ్యంతరం తెలిపారు ఎంపీ జయా బచ్చన్. మహిళల పట్ల ఇలాగేనా వ్యవహరించేది అంటూ పేర్కొన్నారు. దీనిపై స్పందించారు కంగనా రనౌత్.
ఈ సందర్బంగా బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఎంపీ సీరియస్ కామెంట్స్ చేశారు జయా బచ్చన్ పై. ఆమె ముందు నుంచీ అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. జయా అమితాబ్ బచ్చన్ అంటే తప్పేముందని ప్రశ్నించారు కంగనా రనౌత్.
పురుషులు, స్త్రీల మధ్య సహజమైన తేడాలను పనిగట్టుకుని ప్రస్తావించడం దారుణమన్నారు . ఇటువంటి అహంకారం కుటుంబ బంధాలను తీవ్ర ప్రభావం చూపుతాయని మండిపడింది బీజేపీ ఎంపీ.