నిప్పులు చెరిగిన ఎంపీ కంగనా రనౌత్
ఢిల్లీ – భారతీయ జనతా పార్టీ ఎంపీ, ప్రముఖ సినీ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు , రాయ్ బరేలీ ఎంపీ రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. హిండెన్ బర్గ్ నివేదికపై స్పందించారు. పదే పదే అభివృద్దిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు కంగనా రనౌత్.
రాహుల్ గాంధీ ఎన్నటికీ భారత దేశానికి ప్రధానమంత్రి కాలేడని ఎద్దేవా చేశారు. ఆయన ప్రతిపక్షంలో కూర్చుంటారని అన్నారు. దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేలా ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కంగనా రనౌత్.
రాహుల్ గాంధీ మామూలోడు కాదని అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని హెచ్చరించారు. ఇండియా కూటమికి చెందిన ప్రతిపక్షాలు దేశం కోసం పని చేయడం లేదని ఆరోపించారు. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ ప్రజలు పెద్ద ఎత్తున ప్రధాన మంత్రి మోడీని, భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని ఇండియా కూటమిని వద్దని తీర్పు చెప్పారని, అయినా బుద్ది రాలేదన్నారు కంగనా రనౌత్.