ఓటర్లలో ఉత్సాహం సంతోషం
ఆనందం వ్యక్తం చేసిన కన్హయ్య
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. శనివారం ఆరవ విడత పోలింగ్ కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు , ప్రముఖులు , సినీ రంగానికి చెందిన వారు, వ్యాపారవేత్తలు , క్రీడాకారులు, గాయనీ గాయకులు, సాంకేతిక నిపుణులు తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇవాళ ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో పాటు సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈశాన్య ఢిల్లీ కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ తన ఓటు వేశారు. ఆయన ఆప్ నేతలతో కలిసి ఓటర్ల సరళిని పరిశీలించారు.
ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు రావడాన్ని స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అన్ని చోట్లా ఓటర్లలో ఉత్సాహం నెలకొందన్నారు ఈ సందర్బంగా కన్హయ్య కుమార్ మీడియాతో. కొన్ని చోట్ల నెమ్మదిగా మరికొన్ని చోట్ల ఈవీఎంలు పని చేయడం లేదన్న ఫిర్యాదులు కూడా వచ్చాయని చెప్పారు.