జనం కోసం జీవితం – కన్హయ్య
ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ
న్యూఢిల్లీ – ఈశాన్య ఢిల్లీ లోక్ సభ నియోజకవర్గం ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రసంగిస్తూ తాను ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పటికీ తనకు ఉండాలని కోరారు కన్హయ్య కుమార్.
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీజేపీ అభ్యర్థి ఒకప్పుడు రిక్షాలో తిరిగే వాడని ఇవాళ కోట్లకు పడగలెత్తాడని ఆరోపించారు. ఏం పని చేస్తే ఇన్ని డబ్బులు ఎలా సంపాదించాడో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు . దీనికి ఎవరు జవాబుదారీగా ఉండాలో ఆలోచించాల్సిన బాధ్యత మీ ఒక్కరిపై ఉందన్నారు. పని చేసే వారిని ఎన్నుకుంటే నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ది జరుగుతుందన్నారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు కన్హయ్య కుమార్. దేశాన్ని లూటీ చేసిన ఘనత పీఎంకే దక్కుతుందన్నారు. తన జీవితం మొత్తం జనం కోసమే అంకితమని స్పష్టం చేశారు .