కన్హయ్య కుమార్ బిగ్ ఛాలెంజ్
మనోజ్ భయ్యా పై సీరియస్
న్యూఢిల్లీ – ఈశాన్య ఢిల్లీ ఇండియా కూటమి అభ్యర్థి కన్హయ్య కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అబద్దాలను ఎక్కువగా ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు.
వాట్సాప్ అబద్దాల దుకాణం నడుపుతున్నారంటూ ఆరోపించారు. మనోజ్ భాయ్ వాస్తవ సమస్యలపై చర్చకు రావాలని తాను సవాల్ విసురుతున్నానని అన్నారు. కానీ ఆయన తన ఛాలెంజ్ కు భయపడి పోయి ఉంటాడని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో ఇప్పటి దాకా చోటు చేసుకున్న సమస్యలపై చర్చకు రమ్మని తాను కోరానని ఇప్పటి వరకు మనోజ్ దానికి సమాధానం ఇవ్వలేక పోయారని ఆరోపించారు కన్హయ్య కుమార్. చర్చకు రావడానికి ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించారు .
ఈసారి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కచ్చితంగా ఓటమి చెందడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇంకెంత కాలం కులం పేరుతో, మతం పేరుతో ప్రజలను మోసం చేస్తారంటూ నిలదీశారు.