బీజేపీ మోసం దేశానికి శాపం
ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ – ఈశాన్య ఢిల్లీ ఇండియా కూటమి ఎంపీ అభ్యర్థి కన్హయ్య కుమార్ నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అందరికంటే ముందంజలో ఉన్నారు. భారీ ఎత్తున రోడ్ షో ఏర్పాటు చేశారు. ప్రజలను కలుసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
ఈ సందర్బంగా ప్రసంగించిన కన్హయ్య కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో 10 ఏళ్ల పాటు పాలించిన మోదీ సర్కార్ దేశానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఉన్న వనరులను బడా బాబులకు కట్టబెట్టారని, కేవలం కొద్ది మంది బిలియనీర్లకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు కన్హయ్య కుమార్.
ఇండియాను సూపర్ పవర్ గా మారుస్తామని చెప్పారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రస్తుతం కొత్త రాగం అందుకున్నారని, అదేమిటంటే రిజర్వేషన్లు కల్పించడం వల్లనే చేయలేక పోతున్నామంటూ కుంటి సాకులు చెబుతున్నారంటూ ధ్వజమెత్తారు కన్హయ్య కుమార్.
వేల మంది త్యాగాల పునాదులపై నిర్మించిన బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రకు తెర లేపారంటూ ఆరోపించారు.