అమిత్ షా వల్లనే కొడుక్కి పదవి
నిప్పులు చెరిగిన కన్హయ్య కుమార్
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీకి చెందిన యువ నాయకుడు కన్హయ్య కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన కేంద్ర సర్కార్ ను ప్రత్యేకించి ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై మండిపడ్డారు. ఈ దేశంలో ఎందరో అనుభవం కలిగిన క్రికెటర్లు ఉన్నారని, కొందరు రిటైర్ అయ్యారని కానీ వారికి కాకుండా కేవలం అమిత్ షా కొడుక్కి జే షాకు ఎలా బీసీసీఐ కార్యదర్శి పదవి దక్కుతుందని ప్రశ్నించారు.
తన తల్లి అంగన్ వాడిలో పని చేస్తుందని, తన తండ్రి కూలీ పని చేస్తున్నాడని వారిద్దరూ కట్టిన పన్నుతోనే తాను చదువు కున్నానని చెప్పారు కన్హయ్య కుమార్. మా తండ్రి హోం మంత్రి కాలేదు కాబట్టి తాను బీసీసీఐ పదవి దక్కించు కోలేక పోయానని ధ్వజమెత్తారు.
ఈ దేశంలో మతం , కులం రాజకీయాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, ఇవాళ మోదీ నియంతృత్వ పోకడతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన చెందారు. ఈ ఎన్నికలు దేశానికి, 143 కోట్ల భారతీయులకు అత్యంత ముఖ్యమైనవని స్పష్టం చేశారు కన్హయ్య కుమార్.