NEWSNATIONAL

రాచ‌రిక పాల‌న‌కు చెక్ పెట్టాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన క‌న్హ‌య్య కుమార్

న్యూఢిల్లీ – దేశంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఈశాన్య ఢిల్లీ ఇండియా కూట‌మి అభ్య‌ర్థి క‌న్హ‌య్య కుమార్. ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు. వ్య‌వ‌స్థ‌ల‌ను స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త మోదీకే ద‌క్కుతుంద‌న్నారు.

పెట్టుబ‌డిదారుల‌కు వ‌త్తాసు ప‌లుకుతూ పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్న మోదీకి త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం దేశంలో నీతికి, అవినీతికి మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు క‌న్హ‌య్య కుమార్.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ రాసిన భార‌త రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ, బీజేపీ ప‌రివారం ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు . ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ఏ మాత్రం అల‌స‌త్వం వ‌హించినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రించారు ఈశాన్య ఢిల్లీ భార‌త కూట‌మి అభ్య‌ర్థి క‌న్హ‌య్య కుమార్.