కేంద్ర సర్కార్ పై కన్హయ్య కన్నెర్ర
నరేంద్ర మోడీపై యుద్దం తప్పదు
న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కన్హయ్య కుమార్ నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి రాక పోయినా సరే ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి యుద్దం చేస్తూనే ఉంటుందని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
కన్హయ్య కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు మోడీని తిరస్కరించారని, 400 సీట్లు వస్తాయంటూ పదే పదే ప్రగల్భాలు పలికిన భారతీయ జనతా పార్టీని నేల కేసి కొట్టారని మండిపడ్డారు. ఏ మాత్రం నైతికత ఉన్నా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏం ఉద్దరించారంటూ తను ప్రమాణ స్వీకారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఏం చేశారో చెప్పాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టిన ఘనుడు మోడీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కూటమిలో ఇప్పటికే వర్గ పోరు మొదలైందని, వారు ఎంత కాలం ప్రభుత్వాన్ని నడిపిస్తారో వేచి చూడాలన్నారు. ఏది ఏమైనా తాము ప్రజా పక్షం వహిస్తామని స్పష్టం చేశారు కన్హయ్య కుమార్.