ఢిల్లీ పోరాటం కూటమి విజయం
కన్హయ్య కుమార్ సీరియస్ కామెంట్స్
న్యూఢిల్లీ – ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడింది. అంతకు మించి 143 కోట్ల మంది ప్రజలకు రక్షణగా ఉన్న భారత రాజ్యాంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. దీనిని గుర్తించక పోతే రాబోయే కాలంలో మనకంటూ భవిష్యత్తు అనేది ఉండదని హెచ్చరించారు కాంగ్రెస్ యువ నాయకుడు కన్హయ్య కుమార్.
భారత కూటమి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఆదివారం ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా కన్హయ్య కుమార్ కు భారీ ఎత్తున ఆదరణ లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ , కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా రోడ్ షో చేపట్టారు. కన్హయ్య కుమార్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకెంత కాలం కులం, మతం పేరుతో నెట్టుకు వస్తారంటూ ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ పోరాటానికి స్వచ్చంధంగా మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు చెప్పారు కన్హయ్య కుమార్.