NEWSNATIONAL

ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేస్తా

Share it with your family & friends

దాడులు చేస్తే భ‌య‌ప‌డ‌ను

న్యూఢిల్లీ – కాంగ్రెస్ యువ నాయ‌కుడు, ఈశాన్య ఢిల్లీ లోక్ స‌భ ఇండియా కూట‌మి అభ్య‌ర్థి క‌న్హ‌య్య కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓ వైపు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నప్ప‌టికీ త‌న‌కు బెదిరింపులు రావ‌డం మామూలు విష‌యంగా పేర్కొన్నారు. తాను వీటి గురించి ప‌ట్టించుకోన‌ని స్ప‌ష్టం చేశారు. దీనిని లైట్ గా తీసుకుంటున్న‌ట్లు చెప్పారు.

త‌మ దృష్టి కేవ‌లం ప్ర‌జ‌ల కోసం ఎలా ప‌ని చేయాల‌న్న‌ది మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌డం తాను ఇష్ట ప‌డ‌తాన‌ని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ ఒక‌రు త‌నను భ‌య‌పెట్టాల‌ని చూశార‌ని ఆరోపించారు.

ఇలాంటి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించారు క‌న్హ‌య్య కుమార్. త‌న పోరాటం కొన‌సాగుతూనే ఉంటుంద‌న్నారు. నాపై దాడి చేసినా భ‌య‌ప‌డనని పేర్కొన్నారు. ప్ర‌జ‌ల కోసం భ‌రిస్తాన‌ని అన్నారు . తాను గాంధీజీ, బాబా సాహెబ్ అంబేద్క‌ర్ , ష‌హీద్ భ‌గ‌త్ సింగ్ ను ఆద‌ర్శంగా తీసుకుంటాన‌ని చెప్పారు.