SPORTS

కాంబ్లీకి క‌పిల్..స‌న్నీ భ‌రోసా

Share it with your family & friends

ఆదుకుంటామ‌ని ప్ర‌క‌ట‌న

ముంబై – మాజీ క్రికెట‌ర్ వినోద్ కాంబ్లీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంది. ఇటీవ‌ల త‌మ చిన్న‌నాటి కోచ్ విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి స‌చిన్ టెండూల్క‌ర్ తో పాటు కాంబ్లీ కూడా హాజ‌ర‌య్యాడు. గుర్తు ప‌ట్ట‌లేని రీతిలో మారి పోయాడు . ఈ సంద‌ర్బంగా కాంబ్లీ త‌న‌కు ఇష్ట‌మైన పాట‌ను పాడేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. ప్రస్తుతం బీసీసీఐ ఇచ్చే పెన్ష‌న్ తో బ‌తుకుతున్నాడు.

దేశ వ్యాప్తంగా కాంబ్లీని చూసి చ‌లించి పోయారు. ఒక‌ప్పుడు ఒక వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ ఇలా త‌యారు కావ‌డాన్ని జీర్ణించు కోలేక ఆదుకోవాలంటూ కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించారు భార‌త మాజీ కెప్టెన్లు క‌పిల్ దేవ్ నిఖంజ్ , సునీల్ మనోహ‌ర్ గ‌వాస్క‌ర్ .

అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ వినోద్ కాంబ్లేని ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. క‌పిల్ తో పాటు స‌న్నీ కూడా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఈ దేశంలో ఏ ఒక్క క్రికెట‌ర్ ఆర్థిక‌, అనారోగ్యంతో ఉండేందుకు వీలు లేద‌ని పేర్కొన్నారు. కాంబ్లీని త‌న కొడుకుగా అభివ‌ర్ణించారు గ‌వాస్క‌ర్. తామంతా కాంబ్లిని కాపాడుకుంటామ‌ని అన్నారు. నేను స‌హాయం అనే ప‌దాన్ని ద్వేషిస్తున్నాన‌ని అన్నాడు. అత‌డిని ఎలాగైనా స‌రే కుదురుకునేలా చేస్తామ‌ని హామీ ఇచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *