మనీష్ కు కపిల్ సిబల్ మద్దతు
పార్లమెంట్ లో గొంతు వినిపించాలి
న్యూఢిల్లీ – మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు , ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను గతంలో హస్తం పార్టీకి చెందిన వాడినని, ఆ పార్టీ తరపున చండీగఢ్ లో బరిలోకి దిగిన మనీష్ తివారీకి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. ఇందులో అభ్యంతరం ఎందుకు ఉండాలని ప్రశ్నించారు కపిల్ సిబల్.
తన స్వస్థలం చండీగఢ్ అని, సరైన వ్యక్తి ఎన్నిక కావాల్సిన అవసరం ఉందన్నారు . పార్లమెంట్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకున్న వ్యక్తి మనీష్ తివారీ అని కితాబు ఇచ్చారు. ఆయనకంటూ ఓ విజన్ ఉందన్నారు. వివిధ విషయాల పట్ల పూర్తిగా అవగాహన ఉండడమే కాకుండా అద్భుతంగా వాటి గురించి రాస్తున్నాడని తెలిపారు.
దేశ ప్రజలందరి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడని, ఏదో రకంగా ఆయన సేవలు దేశానికి కావాల్సిన అవసరం ఉందన్నారు కపిల్ సిబల్. చాలా ఏళ్లుగా ఆ పార్టీతో అనుబంధం ఉందని , ఆ మేరకు తాను మనీష్ తివారీకి సపోర్ట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా తనను ఆప్ ప్రమోట్ చేసింది. ఎంపీ సీటు కేటాయించింది.
కపిల్ సిబల్ తో పాటు ప్రముఖ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కు కూడా ఛాన్స్ ఇచ్చింది.