కర్ణాటకలో చక్రం తిప్పిన డీకే
కర్ణాటక – కన్నడ నాట తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించారు డిప్యూటీ సీఎం, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన డీకే శివకుమార్. మొత్తం రాష్ట్రం నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్య సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. మరో స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది.
కాగా కర్ణాటకలో భారతీయ బీజేపీ, జేడీ ఎస్ కూటమికి వరుస పరాజయాలు తప్పలేదు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అజయ్ మాకెన్ కు 47 ఓట్లు రాగా , సయ్యద్ నాసిర్ హుస్సేన్ కు 47 ఓట్లు పోల్ కావడం విశేషం. ఇదే పార్టీకి చెందిన జీసీ చంద్రశేఖర్ కు 45 ఓట్లతో గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి వెల్లడించారు.
ఇక బీజేపీకి చెందిన నారాయణ భాండగే 48 ఓట్లు పోల్ అయ్యాయి. జేడీఎస్ అభ్యర్థి కుపేంద్ర రెడ్డి కేవలం 35 ఓట్లు మాత్రమే సాధించారు. అపజయం పాలయ్యారు. మొత్తం 134 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నలుగురు ఇండిపెండెంట్లు , బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేశారు.