Monday, April 7, 2025
HomeNEWSNATIONALమాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌

మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూత‌

ఐటీకి వెన్నుద‌న్నుగా నిలిచిన నేత

క‌ర్ణాట‌క – క‌ర్ణాట‌క మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 92 ఏళ్లు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా, విదేశాంగ శాఖ మంత్రిగా ప‌ని చేశారు. బెంగ‌ళూరును ప్రపంచ ప‌టంలో నిలిపిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు ఎస్ఎం కృష్ణ‌. టెక్నాల‌జీ రంగానికి ఊత‌మివ్వ‌డ‌మే కాకుండా ప్రోత్స‌హించారు. ఇవాళ ఇండియాలోనే బెంగ‌ళూరు ఐటీలో టాప్ లో కొన‌సాగుతుండ‌డానికి ప్ర‌ధాన కార‌కుడు ఎస్ఎం కృష్ణ‌నే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌ధానంగా బెంగ‌ళూరును టెక్ క్యాపిట‌ల్ గా మార్చ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న మే 1, 1932లో మాండ్యా జిల్లాలోని సోమ‌న‌హ‌ళ్లిలో పుట్టారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం ప‌ని చేశారు. చివ‌రి ద‌శ‌లో ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరారు.

కృష్ణ మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరిన తొలినాళ్లలో కృష్ణ తనకు మార్గనిర్దేశం చేశాడని, ఐటి-బిటి రంగం వృద్ధికి, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కృషికి కర్ణాటక ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని స్ప‌ష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments