ఫయాజ్ కు ఉరి శిక్ష విధించాలి
లింగాయత్ మఠాధిపతుల డిమాండ్
కర్ణాటక – పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ సర్కార్ కు తలనొప్పిగా మారింది నేహా హత్య కేసు. ఆమెను దారుణంగా అత్యాచారం చేసి, ఆపై హత్యకు పాల్పడిన నిందితుడు ఫయాజ్ ను ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేక పోయారంటూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
ఆదివారం అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన మఠాధిపతులు, స్వామీజీలు రోడ్డెక్కారు. వారంతా మృతురాలి నేహా కుటుంబానికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా రాష్ట్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సిద్దరామయ్య నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు.
ఓ వైపు నేహా హత్యకు గురై ఇన్ని రోజులవుతున్నా నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఇక కొన్ని రోజుల్లోనే పోలింగ్ జరగనుంది. ఈ సమయంలో పెద్ద ఎత్తున లింగాయత్ లు ఆందోళన బాట పట్టడం ఒకింత కాంగ్రెస్ సర్కార్ లో కదలిక వచ్చింది.
నేహా ఘటనలో కీలక పాత్రధారిగా ఉన్న ఫయాజ్ ను ఉరి తీయాలని వారంతా డిమాండ్ చేశారు.