51-49 ఓట్ల తేడాతో నియామకం
అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ డైరెక్టర్ గా ప్రవాస భారతీయుడైన కాశ్ పటేల్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఆయన నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ లో కేవలం 2 ఓట్ల తేడాతో కాశ్ గట్టెక్కడం విశేషం. ఆయనకు మద్దతుగా 51 ఓట్లు రాగా 49 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. ఇదిలా ఉండగా కాశ్ పటేల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించ బోనంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలా ఉండగా తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించాడు. ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ కు వెన్నంటే ఉన్నాడు. ఆయనపై హత్యాయత్నం జరిగిన సమయంలో కాశ్ పటేల్ సేవ్ చేశాడు. అంతే కాదు కాశ్ పటేల్ ట్రంప్ కు అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి. తను ఎఫ్బీఐ డైరెక్టర్ అయ్యాడంటే పాకిస్తాన్, ఉగ్రవాదుల గుండెల్లో రైళ్లు పరుగుడుతాయి. తను పక్కా హిందువు. శ్రీరాముడి భక్తుడు కూడా. ఆ మధ్యన తాను అయోధ్య రామాలయం గురించి పోస్ట్ చేశాడు. అది వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఎఫ్బీఐ డైరెక్టర్ నియామకం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తను తొమ్మిదో వ్యక్తి. దేశ ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కాశ్ పటేల్. దేశం గర్వించేలా ఎఫ్బీఐని పునర్ నిర్మిస్తామని అన్నాడు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు.