ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి కామెంట్
ఖమ్మం జిల్లా – కామారెడ్డి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకట రమణా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుస్థిరమైన పాలనను అందిస్తున్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ్ సంకల్ప్ యాత్ర సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఖమ్మంలో ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారని, వారంతా దేశంలో పేరు పొందిన వారేనని కానీ తమకు రాజకీయ భిక్ష పెట్టిన ఈ ప్రాంతం పట్ల, అభివృద్ది చేయాలన్న తపన లేకుండా పోయిందన్నారు. ఏ ఒక్కరు కూడా ప్రజల గురించి, వారి సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు కాటేపల్లి వెంకట రమణా రెడ్డి.
అయితే బీజేపీకి సంబంధించి ఒక్క ఎంపీటీసీ కూడా లేని ఈ ప్రాంతంలో కేంద్ర సర్కార్ వేల కోట్ల రూపాయలతో రోడ్లను వేస్తోందని అన్నారు. ఇకనైనా అభివృద్ది వైపు చూసే తమ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే.