కవిత బెయిల్ పై తీవ్ర వాదోప వాదనలు
కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు
ఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరపున సుప్రీంకోర్టులో మంగళవారం వాదోప వాదనలు కొనసాగుతున్నాయి. ఇవాళ కోర్టు విచారణ చేపట్టింది. తన ఆరోగ్యం బాగో లేదని, వెంటనే ఆమెకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు కవిత తరపున వాదిస్తున్న లాయర్ ముకుల్ రోహత్గీ.
కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ఇంకా కొనసాగుతోంది. కవిత బయటకు వస్తుందని ఆమె భర్త తో పాటు సోదరుడు కేటీఆర్ , మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీకి బయలు దేరారు. కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ అడిగిన మేరకు తమ క్లయింట్ కల్వకుంట్ల కవిత అప్పగించారని ఈ సందర్బంగా కోర్టుకు విన్నవించారు. ఫోన్లు మార్చడంలో తప్పు ఏముందంటూ ప్రశ్నించారు. తన క్లయింట్ ఎక్కడికీ పారి పోలేదని, దేశంలోనే ఉన్నారని, పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు, అధికారులకు అందుబాటులో ఉన్నారని చెప్పారు.
సౌత్ గ్రూప్ రూ.100 కోట్లు అంటున్నారు.. దర్యాప్తు సంస్థలు రికవరీ చేయలేదని ఆరోపించార. 493 మంది సాక్షులను విచారించారని, ఇదే సమయంలో సాక్షులను బెదిరించారని వాపోయారు. అయినా ఎక్కడా ఇప్పటి వరకు ఏ కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు ముకుల్ రోహత్గీ.