SPORTS

కావ్య మార‌న్ కెవ్వు కేక

Share it with your family & friends

మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్

హైద‌రాబాద్ – స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు య‌జ‌మానురాలు , సీఈవో కావ్య మార‌న్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఐపీఎల్ అన‌గానే ఆమె ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది. సోష‌ల్ మీడియాలో మోస్ట్ పాపుల‌ర్ సెల‌బ్రిటీగా మారి పోయింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఐపీఎల్ లీగ్ అంతా ఆమె వైపు ఎక్కువ‌గా ఫోక‌స్ పెడ‌తార‌న‌డంలో సందేహం లేదు.

త‌ను జ‌ట్టుకు సీఇఓగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి కీల‌క మార్పులు చేస్తూ వ‌స్తోంది. భారీ ధ‌ర‌కు ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసిన చ‌రిత్ర ఆమెది. ఈసారి ఎలాగైనా స‌రే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు విజేత‌గా నిల‌వాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది.

కావ్య మార‌న్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ వేదిక‌గా ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన కీల‌క పోరులో ఆ జ‌ట్టు ఆట‌గాళ్లు చుక్క‌లు చూపించారు. అభిషేక్ శ‌ర్మ 63 ర‌న్స్ చేస్తే ట్రావిస్ హెడ్ చెల‌రేగాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ రెచ్చి పోయాడు.

త‌క్కువ బంతులు ఎదుర్కొని 80 ర‌న్స్ చేశాడు. ముంబై బౌల‌ర్ల‌ను గ‌డ‌గ‌డ లాడించాడు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో హైద‌రాబాద్ ఏకంగా 277 పరుగులు భారీ స్కోర్ న‌మోదు చేసింది. ఈ సంద‌ర్భంగా కావ్య మార‌న్ మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. నెట్టింట్లో త‌ను వైర‌ల్ అవుతోంది.