కావ్య మారన్ కంటతడి
నిరాశ పర్చిన హైదరాబాద్
చెన్నై – ఐపీఎల్ 2024 బిగ్ క్రికెట్ లీగ్ కథ ముగిసింది. చివరకు అంతిమ విజేతగా శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తనకు ఎదురే లేదని చాటింది. దీంతో తన జట్టు ఐపీఎల్ కప్పును తీసుకుంటే చూడాలని కలలు కన్నది అందాల ముద్దుగుమ్మ, ఐపీఎల్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన సన్ సంస్థల వారసురాలు, ఎస్ఆర్ఎస్ యజమాని , సిఈవో కావ్య మారన్.
కోల్ కతా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. హైదరాబాద్ జట్టును ఏ కోశాన ఆడనీయకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యింది. నిన్నటి దాకా ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన హైదరాబాద్ బ్యాటర్లను వరుసగా పెవిలియన్ కు పంపించడంలో కోల్ కతా బౌలర్లు రాటు దేలారు.
విచిత్రం ఇంకా బంతులు మిగిలి ఉండగానే ఫైనల్ మ్యాచ్ లో 113 పరుగులకే చాప చుట్టేసేలా చేశారు. అనంతరం 8.5 ఓవర్లు కాకుండానే 114 రన్స్ చేసి కోల్ కతా విజేతగా నిలిచింది. దీంతో కన్నీళ్లను ఆపుకోలేక పోయింది కావ్య మారన్. ప్రేక్షకులకు, క్రికెట్ ఫ్యాన్స్ కు కనిపించనీయకుండా తన తండ్రి వైపు మళ్లి ఏడ్చేసింది. చివరకు జట్టును ప్రోత్సాహ పరిచింది. మొత్తంగా నిన్నటి దాకా గంతులేస్తూ వచ్చిన కావ్య ఉన్నట్టుండి భావోద్వేగానికి లోను కావడంతో ఫ్యాన్స్ సైతం కంటతడి పెడుతున్నారు.