బిగ్ బి అమితాబ్ కు కావ్య థ్యాంక్స్
జట్టుకు మద్దతు ఇచ్చినందుకు
తమిళనాడు – ఐపీఎల్ 2024 బిగ్ లీగ్ ముగిసినా ఇంకా ఆ టోర్నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని, సన్ గ్రూప్ చైర్మన్ వారసురాలు కావ్య మారన్.
గత సీజన్ లో నిరాశ పరిచిన హైదరాబాద్ ఈసారి 17వ సీజన్ లో దుమ్ము రేపింది. కావ్య మారన్ భారీ ధరకు ఆసిస్ స్టార్ ప్యాట్ కమిన్స్ ను కొనుగోలు చేసింది. ఈ మేరకు తన సారథ్యంలో ఎస్ ఆర్ హెచ్ అంచనాలకు మించి రాణించింది. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెట్టోరీ , శ్రీలంక స్టార్ మాజీ లెగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ల మార్గదర్శకత్వంలో హైదరాబాద్ జట్టు రాటు దేలింది.
టోర్నీలో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ప్రధానంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్ , నితీశ్ కుమార్ రెడ్డి, తదితర ఆటగాళ్లంతా అద్భుతమైన రీతిలో రాణించారు. తమ జట్టును ఫైనల్ కు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.
ఇదిలా ఉండగా ఫైనల్ మ్యాచ్ లో దారుణంగా ఓడి పోయింది. కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 8 వికెట్లతో పరాజయం పాలైంది హైదరాబాద్. దీంతో కంట తడి పెట్టింది కావ్య మారన్. దీనిపై అమితాబ్ బచ్చన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్బంగా బిగ్ బి కి థ్యాంక్స్ తెలిపింది.