SPORTS

మ‌ద్ద‌తు ఇచ్చినందుకు థ్యాంక్స్

Share it with your family & friends

ట్విట్ట‌ర్ వేదిక‌గా కావ్య మార‌న్ కామెంట్

త‌మిళ‌నాడు – ఐపీఎల్ 2024 క‌థ ముగిసింది. విజేత‌గా శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు నిలిచింది. ఫైన‌ల్ లో ఆసిస్ స్టార్ క్రికెట‌ర్ ప్యాట్ క‌మిన్స్ సార‌థ్యంలోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ దారుణ‌మైన ఓట‌మిని చ‌వి చూసింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన హైద‌రాబాద్ 18.1 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన కోల్ క‌తా ఉతికి ఆరేసింది. 11.1 ఓవ‌ర్ల‌లో ప‌ని కానిచ్చేసింది. కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 114 ర‌న్స్ చేసింది.

ఆఫ్గ‌నిస్తాన్ స్టార్ క్రికెట‌ర్ ర‌హ‌మ‌నుల్లా గుర్బాజ్ 39 ర‌న్స్ చేస్తే యంగ్ క్రికెట‌ర్ వెంక‌టేశ్ అయ్య‌ర్ ఉతికి ఆరేశాడు. హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. ఇదిలా ఉండ‌గా ఊహించ‌ని రీతిలో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది.

ఇదిలా ఉండ‌గా ఐపీఎల్ ఆరంభం నుంచి పూర్త‌య్యేంత దాకా త‌మ జ‌ట్టుకు మ‌ద్ద‌తు ఇచ్చిన ఫ్యాన్స్ కు ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు ఎస్ ఆర్ హెచ్ య‌జ‌మాని కావ్య మార‌న్.