BUSINESSTECHNOLOGY

23న‌ ఎల‌క్ట్రానిక్ యూనిట్ ప్రారంభోత్స‌వం

Share it with your family & friends

కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ

హైద‌రాబాద్ – సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీలో ప్ర‌పంచంలోనే అగ్ర‌గామి సంస్థ‌గా పేరు పొందింది కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ . ఈ కంపెనీ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని కొంగ‌ర కలాన్ లో కొత్త యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్బంగా కొత్త‌గా నిర్మించిన అడ్వాన్స్ ఎల‌క్ట్రానిక్ యూనిట్ ను ఈనెల 23న సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించ‌నున్నారు.

ఈ ప్రారంభోత్స‌వ వేడుక‌ల్లో పాలు పంచు కోవాల్సిందిగా సీఎంను కేమ్స్ సెమికాన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్ర‌తినిధులు ఆహ్వానించారు.

ఈ మేరకు కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) సంస్థ సీఈవో రఘు ఫణికర్ (Raghu Panicker) స్వ‌యంగా స‌చివాల‌యంలో సీఎంతో పాటు ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబును క‌లిసి రావాల‌ని కోరారు.

తాము తెలంగాణతోనే కొనసాగుతామని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) సీఈవో ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

అలాగే, ఇదే కేన్స్ టెక్నాలజీ (Kaynes Technology) కొత్తగా ఏర్పాటు చేయనున్న OSAT యూనిట్ అనుమతుల అంశం పరిశీలనలో ఉంది. ఇండియన్ సెమికండక్టర్ మిషన్ (Indian Semiconductor Mission – ISM) నుంచి అనుమతులు రాగానే ఓశాట్ యూనిట్ ఆపరేషన్స్ కూడా ప్రారంభిస్తామని ర‌ఘు ఫణికర్ తెలిపారు.