Thursday, April 3, 2025
HomeNEWSINTERNATIONALక‌జ‌కిస్తాన్ లో కుప్ప‌కూలిన విమానం

క‌జ‌కిస్తాన్ లో కుప్ప‌కూలిన విమానం

25 మందిని రక్షించిన బృందాలు

కజకిస్తాన్‌లో 67 మందితో ప్ర‌యాణిస్తున్న అజ‌ర్ బైజాన్ ఎయిర్ లైన్స్ విమానం ఉన్న‌ట్టుండి కుప్ప కూలింది. బాకు నుంచి రష్యాలోని గ్రోజ్ని వెళ్తుండగా విమానాన్ని ప‌క్షి ఢీకొట్టింది. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీని అనుమతి కోరాడు పైలెట్.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రిని కాపాడే ప్ర‌య‌త్నం చేశాయి సహాయక బృందాలు.

ఈ ఘ‌ట‌న అక్టౌ సిటీ స‌మీపంలో చోటు చేసుకుంది. మంట్లోకి దూసుకెళ్లింది. ప్ర‌మాదంలో 25 మంది సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఐదుగురు ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆ దేశ అత్య‌వ‌స‌ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఎంబ్రేయర్ 190 విమానం అజర్‌బైజాన్ రాజధాని బాకు నుండి రష్యాలోని చెచ్న్యాలోని గ్ర్జోనీకి వెళ్తుండగా గ్రోజ్నీలో పొగమంచు కారణంగా దారి మళ్లించారు. ఐదుగురు సిబ్బందితో పాటు 62 మంది ప్రయాణికులు విమానంలో ఉన్నారు.

విమానం వేగంగా ఎత్తును కోల్పోతున్నట్లు, దాని కుడివైపు బ్యాంకింగ్ ప్రారంభించినట్లు ఒక వీడియో చూపించింది. బహిరంగ మైదానంలోకి దూసుకెళ్లడంతో మంటలు చెలరేగాయి . విమానాశ్రయం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ని అభ్యర్థిస్తూ అనేక సర్కిళ్లను తీసుకున్నట్లు నివేదించబడింది, కానీ అది నిలిచి కూలి పోయింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments