మీ రుణం తీర్చుకోలేను
కేసీ వేణుగోపాల్ భావోద్వేగం
కేరళ – ఏమిచ్చినా మీకు సరిపోదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. నా హృదయం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుందన్నారు. అలప్పుజా నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఎక్కడ చూసినా జన సంద్రంతో నిండి పోయింది. ఇవాళ చేపట్టిన రోడ్ షోకు ఇంత పెద్ద ఎత్తున పాల్గొంటారని తాను కలలో కూడా అనుకోలేదన్నారు కేసీ వేణు గోపాల్.
ఈ దేశంలో రాచరిక పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నూరైనా సరే తాను మీతోనే ఉంటానని, తనను ఆశీర్వదిస్తున్న మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని స్పష్టం చేశారు కేసీ వేణు గోపాల్.
త్వరలో దేశ వ్యాప్తంగా జరిగే ఎన్నికలు నీతికి, నిజాయితీకి, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని మీ అందరూ ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. దేశంలోని అన్ని వ్యవస్థలు నీరు గారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి కావాల్సింది కులం, మతం, ద్వేషం కాదని ప్రేమ కావాలని అన్నారు కేసీ వేణుగోపాల్.