నిప్పులు చెరిగిన కేసీ వేణు గోపాల్
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సర్కార్ కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వెనకేసుకుందని, ఈ విషయం ఎస్బీఐ వెల్లడించిన వివరాలతో తెలిసిందన్నారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ఆయన ప్రధానంగా పూర్తి వివరాలు ఇంకా వెల్లడించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని ఉద్దరించేందుకు బ్యాంకు పని చేస్తోందంటూ ప్రశ్నించారు.
విరాళాలు బీజేపీకి ఇవ్వడం, ఆ తర్వాత పనులు పొందడం జరిగిందన్నారు. ఎంత మేరకు అవినీతికి అక్రమాలకు పాల్పడితే మెఘా కన్ స్ట్రక్షన్ కంపెనీ నిలువు దోపిడీ చేసిందో అర్థం అవుతుందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు కేసీ వేణు గోపాల్.
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ కాదని అది భారీ ఎత్తున చోటు చేసుకున్న అవినీతికి కేరాఫ్ అని సంచలన ఆరోపణలు చేశారు. దీని ద్వారా క్విడ్ ప్రోకో, దోపిడీ, విధాన పరమైన మార్పులు బట్ట బయలు అయ్యాయని పేర్కొన్నారు.
దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు ఆదేశించినా ఎందుకని ఎస్బీఐ పూర్తి వివరాలు సమర్పించ లేదో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దేశం మోదీని, బీజేపీని నమ్మే స్థితిలో లేదన్నారు.