ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
ఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన వాయనాడు ఉప ఎన్నికల ఫలితం రానే వచ్చింది. ఇక్కడ పోటీ చేసిన ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక అద్బుత విజయాన్ని నమోదు చేశారు. ఏకంగా తన సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ మెజారిటీని సాధించారు. అరుదైన రికార్డ్ నెలకొల్పారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ మెజారిటీని అందించినందుకు , పార్టీ పట్ల మరింత నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియ చేశారు కేసీ వేణుగోపాల్ వాయనాడు ప్రజలకు.
అత్యంత నిజాయతీ, నిబద్దత, అంకిత భావం కలిగిన నాయకురాలైన ప్రియాంక గాంధీని ఎన్నుకున్నారని పేరు పేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.
మీ అందరి తరపున పార్లమెంట్ లో ప్రియాంక గాంధీ తన గొంతును వినిపిస్తారని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. వాయనాడ్‌లోని అన్ని వర్గాల వారి ప్రేమ మరోసారి ఈ ఫలితంతో నిరూపితమైందని పేర్కొన్నారు.
ఇక్కడి ప్రజల పట్ల రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ ప్రేమను కలిగి ఉన్నారని గుర్తు చేశారు. కీలక ప్రయోజనాలను తన ప్రాధాన్యతగా ఉంచారని తెలిపారు, ప్రియాంక గాంధీ కూడా సమాజంలోని ప్రతి వర్గాల సంక్షేమాన్ని చూసేలా ప్రయత్నం చేస్తారని స్పస్టం చేశారు కేసీ వేణగోపాల్.