బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు
ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం బీఆర్ఎస్ ఫౌండర్, ప్రెసిడెంట్ ,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. మంగళవారం బీఎస్పీ బాస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లోని కేసీఆర్ నివాసంలో కలుసుకున్నారు. మర్యాద పూర్వకంగా భేటీ మాత్రమేనని పేర్కొన్నారు. ఇద్దరు నేతలు పొత్తులపై చర్చించారు.
ఆర్ఎస్పీ, కేసీఆర్ కలిసి మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో బీఆర్ఎస్ పొత్తు కుదుర్చు కుంటున్నట్లు చెప్పారు . కలిసి ముందుకు సాగుతామని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ ప్రయాణం సాగుతుందన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గం లేదా పెద్దపల్లి ఎంపీ సీటు కేటాయించే ఆలోచనలో ఉందని పేర్కొన్నారు.
ఈ రెండు స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి బరిలో ఉంటారని, ఈ మేరకు తమ పార్టీ పొత్తులో భాగంగా మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. తాను బీఎస్పీ చీఫ్ కుమారి మాయవతితో మాట్లాడ లేదని చెప్పారు కేసీఆర్. పొత్తు విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాయావతితో చర్చించారని తెలిపారు.