NEWSTELANGANA

సాయ‌న్న కూతురికే ఛాన్స్

Share it with your family & friends

టికెట్ ఖ‌రారు చేసిన కేసీఆర్

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌కట‌న చేశారు. ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉన్న దివంగ‌త ఎమ్మెల్యే సాయ‌న్న కూతురు లాస్య రోడ్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. దీంతో ఆమె స్థానంలో ఎవ‌రిని నియ‌మించాల‌నే దానిపై పార్టీ ప‌రంగా స‌మావేశం జ‌రిగింది. ఈ కీల‌క భేటీలో తిరిగి సాయ‌న్న పార్టీకి సంబంధించి చేసిన సేవ‌ల‌కు గాను తిరిగి దివంగ‌త సాయ‌న్న కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని మూకుమ్మ‌డిగా తీర్మానం చేశారు.

ఈ మేర‌కు బుధ‌వారం కేసీఆర్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా సాయ‌న్న రెండో కూతురు గైని నివేదిత‌ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు. ఈ సంద‌ర్బంగా నివేదిత కుటుంబం మ‌ర్యాద పూర్వ‌కంగా మాజీ సీఎంను క‌లుసుకున్నారు.

పార్టీ ముఖ్యులు, స్థానిక నేత‌లు భేటీ అయిన వారిలో ఉన్నారు. నివేదిత‌కు పోటీగా కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టికే అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. అయితే కంటోన్మెంట్ లో ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు సాయ‌న్న‌. ఎలాగైనా స‌రే బీఆర్ఎస్ సీటు తిరిగి ద‌క్కించు కోవాల‌ని ఈ సంద‌ర్బంగా దిశా నిర్దేశం చేశారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్.