ఎంపీలుగా ఆర్ఎస్పీ..మాజీ ఐఏఎస్
ప్రకటించిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్
హైదరాబాద్ – పార్లమెంట్ ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్. శుక్రవారం ఆయన సంచలన ప్రకటన చేశారు. ఇటీవలే బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ పదవికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్న మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన కోరుకున్నట్టుగానే గులాబీ గుర్తుపై నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించారు.
ఇంకొకరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి, హైకోర్టు మెట్లు ఎక్కి, చివరకు క్షమాపణలు చెప్పిన మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి. ఆయన రాష్ట్ర ప్రజలు తల దించుకునేలా వ్యవహరించారు. ఏకంగా కలెక్టరేట్ నూతన ప్రారంభోత్సవం సందర్బంగా మాజీ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. చివరకు పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకోవడంతో తన పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం రాజ పుష్ప పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేసే సంస్థకు మనోడే కీలకం అని టాక్. ఆయన ఏం ఇచ్చారో తెలియదు కానీ వచ్చిన వెంటనే వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం మెదక్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ఖరారు చేశారు.