సమతూకం సామాజిక న్యాయం
ఎంపీ సీట్లలో అత్యధికంగా ప్రయారిటీ
హైదరాబాద్ – రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడ్డారు. ఓ వైపు తన ఆరోగ్యం బాగా లేక పోయినా ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు. ఎప్పటికప్పుడు దిశా నిర్దేశం చేస్తూ ఎన్నికల యుద్దంలోకి దిగాలని పిలుపునిచ్చారు.
తాజాగా రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పట్ల ప్రజలు విముఖతతో ఉన్నారని, దీనిని గమనించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లాలని సూచించారు కేసీఆర్. ఇదిలా ఉండగా ఈసారి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సామాజిక న్యాయం పాటించేలా చూశారు.
కులాల వారీగా చూస్తే ఇలా ఉన్నాయి. ఖమ్మం నుంచి ఓసీకి చెందిన నామాకు కేటాయించగా మహబూబాబ్ నియోజకవర్గం ఎప్పటి లాగే ఎస్టీకి కేటాయించారు. ఇక్కడ మాలోతు కవితకు ఛాన్స్ ఇచ్చారు. ఇక కరీంనగర్ లో ఓసీకి చెందిన వినోద్ కుమార్ , పెద్దపల్లి నుంచి ఎస్సీకి చెందిన కొప్పుల ఈశ్వర్ కు కేటాయించారు.
మహబూబ్ నగర్ నుంచి ఓసీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల నుంచి బీసీకి చెందిన కాసాని , వరంగల్ నుంచి ఎస్సీకి చెందిన డాక్టర్ కావ్య, నిజామాబాద్ నుంచి బీసీకి చెందిన బాజి రెడ్డి, జహీరాబాద్ నుంచి బీసీకి చెందిన గాలి అనిల్ కుమార్ , ఆదిలాబాద్ నుంచి ఎస్టీకి చెందిన సక్కు, మాల్కాజిగిరి నుంచి రెడ్డికి చెందిన రాగిడికి కేటాయించారు.
మెదక్ నుంచి రెడ్డికి చెందిన ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డికి, నాగర్ కర్నూల్ నుంచి ఎస్సీకి చెందిన ఆర్ఎస్పీ, సికింద్రాబాద్ నుంచి బీసీకి చెందిన పద్మా రావు , భువనగిరి నుంచి బీసికి చెందిన క్యామ, నల్లగొండ నుంచి రెడ్డికి చెందిన కంచర్ల కృష్ణా రెడ్డికి , హైదరాబాగ్ నుంచి బీసీకి చెందిన శ్రీనివాస్ యాదవ్ కు టికెట్లు ఇచ్చారు కేసీఆర్.